Denduluru: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి!

Denduluru: దెందులూరు బాలికల సదన్ వసతి గృహాన్ని DLSA కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సందర్శించారు. బాలికల రక్షణ, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 9:30 PM IST
Denduluru
X

Denduluru: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి!

దెందులూరు: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్.శ్రీలక్ష్మి బుధవారం దెందులూరులోని ప్రభుత్వ బాలికల సదన్ వసతి గృహాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బాలికల రక్షణకు ప్రభుత్వ అధికారులతో పాటు పౌరులంతా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే బాలికలతో పాటు బాలురకు కూడా క్రమశిక్షణ నేర్పాలని సూచించారు.బాలికలు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని,ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు చెప్పడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 15100 ద్వారా జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని తెలిపారు.

వసతి గృహాల్లో బాలికలకు నాణ్యమైన,సుచీకరమైన పోషకాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ అధికారిణి సి.హెచ్.సూర్యచక్రవేణి,ఐసీడీఎస్ నోడల్ అధికారి (ఏలూరు) తులసి,వసతి గృహ విద్యార్థినులు,సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్