Eluru: కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పోలీసుల క్షేత్రస్థాయి పర్యటన!

Eluru: 'అర్నాబ్' తుఫాన్ వేళ ఏలూరు ఎస్పీ శివ కిషోర్ ఆదేశాలతో పోలీసులు కొల్లేరు, ప్రత్తి కోళ్లలంకలో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 12:02 PM IST
Eluru
X

Eluru: కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పోలీసుల క్షేత్రస్థాయి పర్యటన!

Eluru: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలో బలమైన ఈదురు గాలులు,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ,ఆస్తుల రక్షణే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ పరిధిలోని ప్రత్తి కోళ్లలంక,కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో వన్ టౌన్ పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. తుఫాను ముప్పుపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప భారీ వర్షాలు,గాలుల సమయంలో బయటకు రావద్దు అని కొల్లేరు సరస్సు,నీటి ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లడం,పడవ ప్రయాణాలు చేయడం పూర్తిగా నిషిద్ధం అని అధికారుల ఆదేశాల ప్రకారం అవసరమైతే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సహకరించాలి అని ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏలూరు రూరల్ ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్