Eluru: అర్నబ్ తుఫాన్ ముప్పు – కలెక్టర్ వెట్రిసెల్వి కీలక ఆదేశాలు!
Eluru: అర్నబ్ తుఫాన్ ముప్పుపై ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష. లోతట్టు ప్రజల తరలింపు, కంట్రోల్ రూమ్ నంబర్లు ప్రకటన.
Eluru: అర్నబ్ తుఫాన్ ముప్పు – కలెక్టర్ వెట్రిసెల్వి కీలక ఆదేశాలు!
ఏలూరు: ''అర్నబ్' తుఫాన్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏలూరు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డిలతో కలిసి అధికారులకు ముందస్తు జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున,అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఎత్తైన హోర్డింగ్ లను తొలగించడం,శిధిల భవనాలు,రేకుల షెడ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,కాలువలు,చెరువులకు గండ్లు పడకుండా చూడడం,ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న కల్వర్టులు,కాజ్ వే ల వద్ద బారికేడ్లు,ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడం,చెట్లు, స్తంభాలను తొలగించేందుకు క్రేన్లు,జేసీబీలతో అన్ని శాఖల అధికారులు మండలస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.సమస్యాత్మక మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
సహాయం కోసం సంప్రదించాల్సిన అత్యవసర నంబర్లు:
* జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్:
📞 18002331077 | 📞 08812-224519 | 📞 9491041419
* విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ & టోల్ ఫ్రీ:
📞 1912 | 📞 9440902926 | 📞 9440904037 | 📞 9491030712
వర్షాల సమయంలో ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకూడదని,నదులు,కాలువల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.




