Eluru: అర్నాబ్ తుఫాన్ వేళ తహసీల్దార్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్!

Eluru: అర్నాబ్ తుఫాన్ తీవ్రతపై ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి టెలికాన్ఫరెన్స్. మండలాల వారీగా నష్ట నివారణ ప్రణాళికలు, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు స్పష్టమైన ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 11:25 PM IST
Eluru
X

Eluru: అర్నాబ్ తుఫాన్ వేళ తహసీల్దార్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్!

ఏలూరు: అర్నాబ్ తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఏలూరు జిల్లాలో అర్నాబ్ తుఫాన్ తీవ్రతపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అర్నాబ్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా,నష్టాల నివారణ కు మండల స్థాయి ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.మండలంలో శిధిల భవనాలు,కట్టడాలు,రేకుల షెడ్డులపై,లోతట్టు ప్రాణాలను తరలించే ప్రజల వివరాలు,గట్లు బలహీనంగా ఉన్న నదులు,చెరువులు,కాలువలు,తదితర వివరాలతో నివేదికను అత్యవసరంగా అందించాలన్నారు.

తుఫాన్ కారణంగా కూలిన చెట్లు,స్తంబాలు తొలగించేందుకు,విద్యుత్ సరఫరా పునరుద్దరణకు మండల స్థాయిలో క్రేన్లు,జెసిబి లు వంటి పునరుద్ధరణ పరికరాలు,సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు.తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు.మండలాల్లో గర్భిణీలు,బాలింతలు,వృద్దులు,దివ్యాంగులు లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఆసుపత్రులలో పాముకాటు మందులు సిద్ధంగా ఉంచాలన్నారు.పంట‌ల‌తోపాటు ప‌శు సంప‌ద‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, భారీ గాలుల స‌మ‌యంలో ప‌శువుల‌ను క‌ట్టిఉంచ‌కూడ‌ద‌ని సూచించారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలెవ్వరూ నదులు,చెరువులు,కలువలలోకి వెళ్లకుండా చూడాలన్నారు.భారీ వర్షాల సమయంలో కల్వర్టులు, కాజ్ వే లను ప్రజలను దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు,సిబ్బందిని నియమించాలని,బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్