Eluru: బాలల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించాలి: ఎన్. శ్రీలక్ష్మి!
Eluru: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి బాలల హక్కులపై అవగాహన కల్పించారు.
Eluru: బాలల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించాలి: ఎన్. శ్రీలక్ష్మి!
ఏలూరు జిల్లా: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏలూరులోని శనివారపుపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నిర్వహించిన వేడుకల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల నిర్బంధ విద్య,పోక్సో చట్టం,సురక్షిత స్పర్శ, బాల కార్మిక వ్యవస్థ,బాల్యవివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధంపై అవగాహన కల్పించారు.
అనంతరం దొండపాడులోని పరివర్తన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలను సందర్శించి ఉచిత న్యాయ సేవలపై వివరించారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.




