Kukunoor: కుక్కునూరులో స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా సీపీఐ విస్తృత సమావేశం!

Kukunoor: కుక్కునూరు మండలంలో స్థానిక ఎన్నికల్లో సీపీఐ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య పిలుపు. గిరిజన సమస్యలపై ఆగ్రహం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Oct 2026 5:43 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా సీపీఐ విస్తృత సమావేశం!

కుక్కునూరు: త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కుక్కునూరు మండలంలో సీపీఐ గెలుపు కోసం కార్యకర్తలు బలమైన కృషి చేయాలని ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ. కృష్ణచైతన్య పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం శాఖా కార్యదర్శి వరసా.పాపారావు అధ్యక్షతన మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ మండలంలో సీపీఐ ప్రభావం ఉన్న ప్రతిచోట పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తి అలుపురెగని పోరాటాలు చేస్తూ ప్రజల తరపున నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు.ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాఎందరో పాలకులు మారినా ఏజెన్సీలోని గిరిజనులు తలరాతలు మారడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రతి సారీ వచ్చే ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారే తప్ప సమస్యలు పట్టించుకోవడంలో ఆవగింజంత దృష్టి పెట్టడం లేదని ఆయిన ఆరోపించారు.కుక్కునూరు ఏజెన్సీలో నివసిస్తున్న వలస గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంలో అధికారులు, పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దీంతో అర్హులైన విద్యావంతులు ఉద్యోగవకాశాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి కూడా వలస గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే రహదారులు లేక కాలిబాటలే దిక్కుని,విద్యుత్ లేక చీకట్లో జీవితాలు వెళ్లదీస్తూ అంత దయనీయ స్థితిలో అడవి బిడ్డలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమనిన్నారు.ఈ సమావేశంలో కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య, ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా. శ్యామల, జిల్లా సమితి సభ్యులు అయితా. సురేష్ బాబు, మైసాక్షి. వెంకటాచారి, కూరకుల. బాబురావు, కోమాల్ల.ఖాసి, ఉంగా, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR