Jangareddygudem: జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ వార్నింగ్!
Jangareddygudem: జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులను హెచ్చరించారు.
Jangareddygudem: జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ వార్నింగ్!
Jangareddygudem: జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.స్థానిక పురపాలక సంఘ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు మెరుగైన పౌర సేవలందించడం పురపాలక సంఘాల ప్రధాన బాధ్యతన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ,డ్రైనేజీలు,సురక్షిత త్రాగునీరు అందించడం,రోడ్లు,వీధి దీపాల నిర్వహణ, తదితర సేవలను పౌరులకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత మునిసిపల్ అధికారులు,సిబ్బందిపై ఉందన్నారు.ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని,రోడ్లపై ఎక్కడైనా చెత్త కనపడినా,డ్రైన్లలో మురుగునీరు నిల్వ,ఉన్న,వీధి దీపాలు వెలగకపోయినా,రోడ్లు మరమ్మత్తులు పూర్తికాకపోయినా మునిసిపల్ సిబ్బందిని బాధ్యులను చేస్తాసనన్నారు.
పన్నులను లక్ష్యాల మేర వసూలు చేయాలనీ,అదే సమయంలో పౌరులకు మెరుగైన సేవలందేలా చూడాలన్నారు.పౌర సేవలు అందించడంలో విఫలమయ్యారని ప్రజల నుండి ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే విచారణ చేసి సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకుంటానన్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది తెల్లవారుఝాము నుంచే పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.పట్టణంలో పారిశుద్ధ్య పనులను మునిసిపల్ కమీషనర్ ఉదయం నుండి పర్యవేక్షించాలన్నారు.ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ కె.వి.రమణ,తహసీల్దార్ స్లీవ్ జోజి,మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది,ప్రభృతులు పాల్గొన్నారు.




