Eluru: మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి.. కలెక్టర్!

Eluru: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 22 Nov 2026 8:36 AM IST
Eluru
X

Eluru: మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి.. కలెక్టర్!

Eluru: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన,రోడ్డు భద్రత, మహిళా భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి,ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటి అక్రమ రవాణా సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల సమయంలో 112 నంబర్‌కు కాల్ చేయాలని,మహిళలు,విద్యార్థినులు భద్రత కోసం శక్తి యాప్ లేదా 181 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ ఆపద సమయంలో శక్తి యాప్‌లోని SOS బటన్ ద్వారా తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని, విద్యార్థినులందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు,పోలీసు సిబ్బంది,శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid