Eluru: ఏలూరులో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు.. కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 22 Nov 2026 8:21 AM IST
Eluru
X

Eluru: ఏలూరులో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు.. కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ (NCORD) కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ షాపులు,ఆసుపత్రుల్లో నార్కోటిక్ మందుల విక్రయాలు,నిల్వలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు,కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్,పోలీస్,వైద్య ఆరోగ్య శాఖ,ఈగిల్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid