Eluru: పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్!
Eluru: కైకలూరు ఏఎంసీ ఆవరణలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Eluru: పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్!
Eluru: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.శనివారం కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మరియు కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈనెల 29న (ఆదివారం)జిల్లాలోని 8 మండలాల్లో గల 160 సర్పంచ్,1219 వార్డు సభ్యుల స్థానాలకు 2,024 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి అని ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు (1:00 గంట లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది) మధ్యాహ్నం 2:00 గంటల నుండి అదే కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ విజయలక్ష్మి,తహసీల్దార్ రామకృష్ణ,ఎంపిడిఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




