Eluru: పెండింగ్ జీఎస్టీ రిటర్నులను వెంటనే దాఖలు చేయాలి.. కలెక్టర్ ఆదేశం!
Eluru: ఏలూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 219 జీఎస్టీఆర్-7 రిటర్నులను వెంటనే దాఖలు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
Eluru: పెండింగ్ జీఎస్టీ రిటర్నులను వెంటనే దాఖలు చేయాలి.. కలెక్టర్ ఆదేశం!
Eluru: ప్రభుత్వ మౌలిక వసతుల పనుల్లో జీఎస్టీ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జీఎస్టీ అనుసరణ,పన్ను ఆదాయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 219 జీఎస్టీఆర్-7 రిటర్నులను వెంటనే దాఖలు చేయాలని, అన్ని శాఖలు ప్రతి నెలా రిటర్నులు సమర్పించాలని సూచించారు.2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి సుమారు రూ.3,161.13 కోట్ల విలువైన పనులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయా పనుల్లో వర్తించే జీఎస్టీ టీడీఎస్‌ను మినహాయించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




