Eluru: నవంబర్ 1 నాటికి కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలి!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను నవంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 7:20 AM IST
Eluru
X

Eluru: నవంబర్ 1 నాటికి కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలి!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను నవంబర్ 1వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బందికి నవంబర్ 2న మొదటి విడత, నవంబర్ 6న రెండో విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి అని వర్ష సూచన ఉన్నందున బ్యాలెట్ బాక్సులు తడిచిపోకుండా,కౌంటింగ్ అనంతరం వాటిని స్ట్రాంగ్ రూమ్‌లలో అత్యంత పటిష్టంగా భద్రపరచాలి అని కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బందికి,ఏజెంట్లకు వేర్వేరు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలి అని కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు,ఏజెంట్లు ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా చూడాలి అని సూచించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న,రమణ,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్