Eluru: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 29 Nov 2026 8:04 AM IST
Eluru
X

Eluru: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్!

Eluru: చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆమె,ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరైనందున ప్రధాన కాలువ తవ్వకాలకు అవసరమైన మిగిలిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పెండింగ్ పరిహార చెల్లింపులకు సంబంధించి తహసీల్దార్లు రైతుల నుండి అవసరమైన పత్రాలు సేకరించి భూసేకరణ అధికారులకు అందించాలని,ప్రభుత్వ భూముల బదలాయింపు ప్రతిపాదనలను త్వరితగతిన పంపి,సేకరించిన భూములను నీటిపారుదల శాఖకు అప్పగించి పనులు నిరాటంకంగా సాగేలా చూడాలని సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న,రమణ,భూసేకరణ ఎస్డీసీలు,ఇంజనీర్లు మరియు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid