Eluru: ‘ఆక్వాన్’ తుఫాన్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ఏలూరు కలెక్టర్!

Eluru: ‘ఆక్వాన్’ తుఫాన్ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Nov 2026 7:07 AM IST
Eluru
X

Eluru: ‘ఆక్వాన్’ తుఫాన్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ఏలూరు కలెక్టర్!

Eluru: ‘ఆక్వాన్’ తుఫాన్ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ సంసిద్ధతపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు,ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.గర్భిణీలు,వృద్ధులు,చిన్నారులు,దివ్యాంగులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని,అవసరమైన బోట్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

వాగులు,కల్వర్టులు,కాజ్‌వేల వద్ద బారికేడ్లు,హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పంట నష్ట నివారణకు రైతులకు సూచనలు అందించాలని,ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు, తహసీల్దార్లు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్