Eluru: లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఏలూరు జిల్లా కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లాలో 2.52 లక్షల మంది పింఛన్‌దారులకు రూ. 111.04 కోట్ల పంపిణీని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు. ఫిరంగులదిబ్బలో లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్ళి పింఛను నగదు అందజేత.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 6:14 AM IST
Eluru
X

Eluru: లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఏలూరు జిల్లా కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లాలో ఈ నెల 2,52,397 మంది పింఛన్‌దారులకు రూ. 111.04 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.శుక్రవారం ఆమె స్థానిక ఫిరంగులదిబ్బ ప్రాంతంలో పర్యటించి కగ్గా అంకులమ్మ,గండికోట పాపమ్మ,గండికోట వీర్రాజమ్మ తదితర లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కోసం 4,916 మంది సచివాలయ,ఇతర ప్రభుత్వ సిబ్బందితో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

అర్హులైన పింఛన్‌దారులందరికీ నగదు అందేలా చర్యలు తీసుకున్నామని,అక్టోబర్ 30న పింఛన్ తీసుకోలేకపోయిన వారికి నవంబర్ 5వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భానుప్రతాప్, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు తహసీల్దార్,మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్