Eluru: నవంబర్ 1న ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ పోలింగ్!
Eluru: ఏలూరు జిల్లాలో నవంబర్ 1న ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీలకు పోలింగ్. ప్రచార గడువు ముగియడంతో స్థానికేతరులు పట్టణం వదిలి వెళ్లాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం.
Eluru: నవంబర్ 1న ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ పోలింగ్!
Eluru: ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ,జంగారెడ్డిగూడెం మరియు నూజివీడు మున్సిపాలిటీలకు 01-11-2026వ తేదీన పోలింగ్ నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు.
పోలింగ్ ఉదయం 7 నుండి సాయంత్రం 5. గంటల వరకు జరుగునని, పోలిగ్ ముగిసే సాయంత్రం 5.00గం.ల ముందు నుండి 48 గంటల వరకు, అనగా 30.10.2026 సాయంత్రం 5.00 గం.ల నుండి 01.11.2026 సాయంత్రం 5.00గం.ల అనగా ఈ 48గంటల మధ్య కాలంలో ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు ఎలాంటి ప్రచారాలు చెయ్యరాదని, కావున పోటీలో ఉన్న అభ్యర్థులు,రాజకీయ పార్టీలు ప్రచార గడువును తప్పనిసరిగా పాటించాలన్నారు
.ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎలాంటి బహిరంగ సభలు,ర్యాలీలు,ఊరేగింపులు,మైక్ ప్రచారం లేదా ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు.ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఎన్నికల నియమావళి ప్రకారం సంబంధిత ఎన్నికల ప్రాంతానికి చెందని రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రచారకర్తలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువుల పంపిణీ వంటి అక్రమ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదని, ఇటువంటి ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ శాఖ మరియు ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు,ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు.




