Chinturu: ప్రచారం చివరి రోజు చింతూరు ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ!

Chinturu: చింతూరు ఏజెన్సీలో ప్రచారం చివరి రోజు వైఎస్ఆర్సీపీ హోరెత్తించిన ర్యాలీ. మండల కన్వీనర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం జోరు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 3 Nov 2026 2:09 PM IST
Chinturu
X

Chinturu: ప్రచారం చివరి రోజు చింతూరు ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ!

చింతూరు: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎన్నికల ప్రచారం చివరి రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ సత్తా చాటాయి. మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి ఆధ్వర్యంలో చింతూరు ప్రధాన సెంటర్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు.జై జగన్ నినాదాలతో చింతూరు వీధులు మార్మోగాయి. వైసీపీ జెండాలు చేతబట్టి, అభ్యర్థులను గెలిపించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగియనుండడంతో, చివరి నిమిషంలో కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమించాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించారని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సంక్షేమానికి జగన్ చేసిన కృషిని ప్రజలు మర్చిపోలేదని, అందుకే ఈ ఎన్నికల్లో MPTC, ZPTC స్థానాల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేసి తమ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చింతూరు మండలంలోని 12 MPTC, 1 ZPTC స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR