Chinturu: ముకునూరులో మార్పు కోసం యువకుడి పోరాటం.. నాగరాజుకు బ్రహ్మరథం

Chinturu: చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ముమ్మర ప్రచారం; యువత, గ్రామస్తుల నుంచి విశేష స్పందన.

RAJESH REDDY, CHINTOOR
Published on: 24 Nov 2026 4:11 PM IST
Chinturu
X

Chinturu: ముకునూరులో మార్పు కోసం యువకుడి పోరాటం.. నాగరాజుకు బ్రహ్మరథం

చింతూరు: ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే సర్పంచ్ బరిలో దిగిన నాగరాజు, గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.

పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారి కష్టసుఖాలు, సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రధాన సమస్యలపై ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

వాటన్నింటినీ ఓపికగా విన్న నాగరాజు, గెలిచిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.యువకుడి ఉత్సాహం, కొత్త ఆలోచనలు గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. నాయకుడు అంటే గ్రామంలోనే ఉండి, ప్రజలతోనే ఉండాలని, సమస్య వస్తే వెంటనే స్పందించాలని నాగరాజు చెబుతున్న మాటలు యువతలో స్ఫూర్తి నింపుతున్నాయి.

ఆయన ప్రచారంలో యువకులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు.వయసు చిన్నదైనా ఆలోచన పెద్దది. మన గ్రామానికి ఇలాంటి యువ నాయకుడే కావాలి అని గ్రామ పెద్దలు అంటున్నారు. నాగరాజు విజయం సత్యమని, ముకునూరులో ఈసారి యువతదే విజయమని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR