Chinturu: చింతూరు మండలంలో టీడీపీకి భారీ ప్రజాదరణ.. 103 కుటుంబాల చేరిక!
Chinturu: చింతూరు మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు. 3 గ్రామాల నుంచి 103 కుటుంబాలు చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నాయకులు మహమ్మద్ జమాల్ ఖాన్, ఇల్లా చిన్నారెడ్డి.
Chinturu: చింతూరు మండలంలో టీడీపీకి భారీ ప్రజాదరణ.. 103 కుటుంబాల చేరిక!
Chinturu: చింతూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ దినదినం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సైకిల్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా మండలంలోని మూడు గ్రామాల నుంచి ఏకంగా 103 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పేగ గ్రామపంచాయతీ పరిధిలోని కలిగుండ నుంచి 25, సూరకుంట నుంచి 40 కుటుంబాలు, ఏడుగురాలపల్లి పంచాయతీ పరిధిలోని దొంగల జగ్గరం గ్రామం నుంచి 38 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
ఈ చేరికలతో మండలంలో టీడీపీ బలం మరింత పెరిగింది.ఈ చేరికల కార్యక్రమాలకు చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ జమాల్ ఖాన్ నేతృత్వం వహించారు. మాజీ మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డితో కలిసి ఆయన నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కలిగుండ, సూరకుంట గ్రామాల్లో పేగ ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతి ఆధ్వర్యంలో చేరికలు జరగగా, సూరకుంటలో పటేల్ తోడేం రామయ్య, గ్రామ పూజారి తోడేం మల్లేశ్వరరావు, కట్టాం అశోక్ కీలక పాత్ర పోషించారు. దొంగల జగ్గరం గ్రామంలో దారావత్ స్వామి, భూక్యా సుందర్, భూక్యా మోహన్ ఆధ్వర్యంలో 38 కుటుంబాలు పార్టీలో చేరాయి.
సమస్యలపై స్పందించిన జమాల్ ఖాన్
ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను జమాల్ ఖాన్ దృష్టికి తెచ్చారు. కలిగుండలో వంతెన నిర్మాణం, దొంగల జగ్గరంలో చెరువు పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జమాల్ ఖాన్, ఆ సమస్యలను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాయకుడిగా కాకుండా అందుబాటులో ఉండే సేవకుడిగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.అనంతరం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏడుగురాలపల్లి ఎంపీటీసీ అభ్యర్థి బత్తుల నాగమణి, పేగ ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతిలను పరిచయం చేస్తూ, సైకిల్ గుర్తుకు, అలాగే జడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మూడు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలతో ప్రచారం చేశారు.




