Chintoor: చింతూరు పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌కు వైసీపీ సిద్ధం

Chintoor: చింతూరు మండలంలోని 18 పంచాయతీల్లో మళ్లీ క్లీన్ స్వీప్ లక్ష్యంగా మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి వ్యూహాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Nov 2026 8:29 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌కు వైసీపీ సిద్ధం

చింతూరు: చింతూరు మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గ్రామ గ్రామాన ఒకటే చర్చ... ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ చరిత్రను తిరగరాస్తుందా ?. ఎందుకంటే గత ఎన్నికల్లో చింతూరులో జరిగింది మామూలు విజయం కాదు. మండలంలోని 18 పంచాయతీలకు 18 పంచాయతీలు... ఒక్కటి కూడా వదలకుండా వైఎస్ఆర్సీపీ విజయదుందుభి మోగించింది. ప్రత్యర్థులు నిలబడేందుకు కూడా చోటు లేకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఆ చరిత్రను మరోసారి పునరావృతం చేస్తుందా అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

మొన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే హవా కొనసాగింది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో 10 స్థానాలు, జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీ తన పట్టు ఎంత బలమైనదో మరోసారి నిరూపించింది. ఆ ఊపు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఎన్నికలను మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. గతంలో కంటే మెరుగైన ఫలితం సాధించాలి అన్నదే ఆయన లక్ష్యం. ఆయన వ్యూహాలు, పార్టీ నేతల సమన్వయం ప్రత్యర్థులకు సవాల్ గా మారాయి.మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ గ్రామాల్లో పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రజల్లో మళ్లీ అదే ప్రభంజనం అన్న మాట బలంగా వినిపిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నాయకుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మరి చింతూరు ప్రజలు మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తారా? లేక ఈసారి కొత్త మార్పుకు తెర తీస్తారా? సమాధానం కోసం ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఉత్కంఠ కొనసాగుతోంది !.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR