Chintoor: బాధ్యతలు స్వీకరించిన రోజునే రక్తదానం చేసిన సబ్ కలెక్టర్
Chintoor: చింతూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చిట్టాపులి నరేంద్ర పడాల్ అదే రోజు రక్తదానం చేసి ప్రజల మన్ననలు పొందారు.
Chintoor: బాధ్యతలు స్వీకరించిన రోజునే రక్తదానం చేసిన సబ్ కలెక్టర్
చింతూరు: చింతూరు సబ్ కలెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన చిట్టాపులి నరేంద్ర పడాల్ అదే రోజు రక్త దానం చేసి ప్రజల మన్ననలు పొందారు.సబ్ కలెక్టర్ లో ఉన్న సేవా దృక్పథాన్ని చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు.రక్తదాన దినోత్సవం సందర్భంగా చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సబ్ కలెక్టర్ చిట్టాపులి నరేంద్ర ఐఏఎస్, సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్,ఇన్స్పెక్టర్ అంబు సీజన్,డాక్టర్ స్పందన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అధికారులు సిబ్బంది రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులకు,శస్త్ర చికిత్సలు చేయించుకునే రోగులకు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రక్తం అవసరమైన వారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతుందని తెలిపారు.
రక్తదానం పై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.రక్తం అవసరమైన సమయంలో సకాలంలో అందుబాటులో ఉండేలా స్వచ్ఛంద రక్తదాతలు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
సమాజ సేవలో భాగంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సేవా భావాన్ని పెంపొందించడంతోపాటు ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్యుల సూచనల మేరకు రక్తదానానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు,వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరం నిర్వహణలో తమ సహకారం అందించారు.




