Chintoor: స్నేహితుడిని కాపాడబోయి వాగు ప్రవాహంలో యువకుడు!

Chintoor: చింతూరు తులసిపాక సోకిలేరు వాగులో విషాదం: స్నేహితుడిని కాపాడబోయి భీమవరం యువకుడు గల్లంతు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 27 Sept 2026 5:47 PM IST
Chintoor
X

Chintoor: స్నేహితుడిని కాపాడబోయి వాగు ప్రవాహంలో యువకుడు!

చింతూరు: చింతూరు ఏజెన్సీలోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు విహారయాత్ర కు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు నుండి 16 మంది ఓ మినీ బస్సులో మారేడిమిల్లి, చింతూరు లోని పకృతి అందాలను ఆస్వాదించడానికి ఆదివారం వచ్చారు.

చింతూరు మండలం తులసిపాక వద్ద గల సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల వాగులో స్నానం చేయడానికి నలుగురు యువకులు దిగారు. ఉచ్చుల శ్యాం కిషోర్ వాగులో కొట్టుకుపోతుండగా బుంగ బాలవందనం(18) రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో శ్యామ్ కిషోర్ వాగులో నుంచి బయటపడగా బాలవందనం వాగులో గల్లంతయ్యాడు.

వాగులో గల్లంతయిన బాలవందనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చిన్నపేట గ్రామంలోని చికిలివీధికి చెందిన యువకుడు. వాగులో యువకుడు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న చింతూరు సిఐ గోపాలకృష్ణ,మోతుగూడెం ఎస్ఐ హుస్సేన్ లు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గల్లంతయిన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR