Chintoor: చింతూరులో ‘బీ-ఫాం’ ఉత్కంఠ: కూటమి నేతల్లో టెన్షన్!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి అభ్యర్థుల్లో బీ-ఫాం ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ముమ్మర లాబీయింగ్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Oct 2026 10:08 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో ‘బీ-ఫాం’ ఉత్కంఠ: కూటమి నేతల్లో టెన్షన్!

చింతూరు: చింతూరు మండలంలో జరిగే ఎంపీటీసీ జడ్పిటిసి సమరంలో కూటమి తరపున ఏ అభ్యర్థులు బరిలో నిలుస్తారు ?ఎవరు నిష్కమిస్తారు ? అనే దాని పై తీవ్ర ఉత్కంఠ కూటమి నాయకులలో నెలకొంది. చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పిటిసి స్థానానికి గాను జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఎంపీటీసీ స్థానాలకు, జడ్పిటిసి స్థానానికి కూటమి నుంచి ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులునామినేషన్ దాఖలు చేయడం చేయడం జరిగింది. నామినేషన్ పర్వం,నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల బరిలో కూటమి తరుపున ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి బరిలో నిలబడతాడో అని ఆసక్తికరంగా మారింది.

చింతూరు కూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోవడంతో బీఫామ్ ఏ అభ్యర్థి ని వరిస్తుందోనని నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జనసేన,తెలుగుదేశం,బిజెపి నాయకత్వం తమ పార్టీ అభ్యర్థులే ఎన్నికల బరిలో నిలిచేలా లాబీయింగ్ ముమ్మరం చేసారు.

తాము అనుకున్న స్థానాలలో తమ అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోతే ఇండిపెండెంట్ గా అయిన పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. బీఫామ్ ఏ అభ్యర్థిని వరిస్తుందో, తదుపరి రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయో ఎదురుచూడాల్సిందే.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR