Chintoor: చింతూరు మార్పు కోరుకుంటోంది.. కారం సత్యవతి ముమ్మర ప్రచారం
Chintoor: చింతూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కారం సత్యవతి ముమ్మర ప్రచారం; టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి ఓటర్ల విశేష స్పందన.
Chintoor: చింతూరు మార్పు కోరుకుంటోంది.. కారం సత్యవతి ముమ్మర ప్రచారం
చింతూరు: చింతూరు డివిజన్ హెడ్ క్వార్టర్ చింతూరు పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. కూటమి తరపున తెలుగుదేశం మద్దతుతో కారం సత్యవతి బరిలోకి దిగడంతో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది.చింతూరుకు ఎంతో ప్రత్యేకత ఉందని, కానీ దశాబ్దాలుగా సర్పంచ్ గా ఎన్నికైన వారు అభివృద్ధి బాట చూపలేకపోయారని సత్యవతి ఘాటుగా విమర్శించారు.
“ఒక్కసారి నన్ను గెలిపించండి... చింతూరును అభివృద్ధి బాటలో పయనింపజేస్తా” అంటూ ఆమె ప్రజలకు భరోసా ఇస్తున్నారు.తెలుగుదేశం మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ దగ్గరుండి సత్యవతి కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామ గ్రామాన తిరుగుతూ, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
సత్యవతి ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులు పడుతూ, పెద్దలు ఆశీర్వదిస్తూ, యువత జై కొడుతూ స్వాగతం పలుకుతున్నారు. ఓటర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుండటంతో చింతూరులో సత్యవతి విజయం ఖాయమన్న ధీమా కూటమి శ్రేణుల్లో కనిపిస్తోంది.




