Chintoor: ముకునూరులో యువ సర్పంచ్ అభ్యర్థి హవా.. ఇంటింటికి పాయం నాగరాజు
Chintoor: చింతూరు మండలం ముకునూరు పంచాయతీ జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ఇంటింటి ప్రచారం; గ్రామ అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, ఉపాధి ప్రధాన అజెండా.
Chintoor: ముకునూరులో యువ సర్పంచ్ అభ్యర్థి హవా.. ఇంటింటికి పాయం నాగరాజు
చింతూరు: ముకునూరు పంచాయతీలో జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ప్రచారం దూసుకుపోతోంది. చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగరాజు, పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను స్వయంగా కలుస్తున్నారు.
ప్రజల సమస్యలను ఓపికగా వింటూ, వాటికి పరిష్కారం చూపే దిశగా తన ప్రణాళికను వివరిస్తుండటంతో గ్రామాల్లో ఆయనకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల నుంచి విశేష ఆదరణ కనిపిస్తోంది.నాగరాజుకు అండగా జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్ (కప్పు), సతీష్ దగ్గరుండి ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.
"వయసు చిన్నదే కానీ, ఆలోచన పెద్దది.. మార్పు కోసం నాగరాజు" అంటూ కార్యకర్తలు నినదిస్తున్నారు.గ్రామ అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, యువతకు ఉపాధి అవకాశాలే తన ప్రధాన అజెండా అని నాగరాజు చెబుతున్నారు.




