Chintoor: వరద బాధితులకు భోజనం అందజేసిన జమాల్ ఖాన్

Chintoor: చింతూరులో వరద బాధితులకు భోజనం అందజేసిన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్. పునరావాసానికి ఉచిత ట్రాక్టర్ల ఏర్పాటు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Sept 2026 5:15 PM IST
Chintoor
X

Chintoor: వరద బాధితులకు భోజనం అందజేసిన జమాల్ ఖాన్

చింతూరు: చింతూరు ఏజెన్సీలో వరద ముంచెత్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ భోజనం అందజేశారు.వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల కోసం ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ భోజనం అందించారు.

వరదల కారణంగా జన జీవనం స్తంభించి,ఆహారం కోసం బాధితులు ఇబ్బందులు పడుతున్నరని గుర్తించిన జమాల్ ఖాన్ వారి కోసం బోధన సదుపాయం ఏర్పాటు చేశారు. వరద ముంపునకు గురైన బాధితుల ఇంటి సామాగ్రిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జమాల్ ఖాన్ ఉచితంగా టాక్టర్లను ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఆహారం,అవసరమైన సహాయాన్ని అందిస్తూ అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు.వరద పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం వేళల్లో బాధితులకు భోజన సదుపాయం కల్పిస్తామని జమాల్ ఖాన్ అన్నారు.

వరద బాధితుల కోసం జమాల్ ఖాన్ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి నేనున్నానంటూ అభయం ఇవ్వడం,అండగా నిలబడటం జమాల్ ఖాన్ ప్రత్యేకత అని పలువురు అభివర్ణిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR