Chintoor: చింతూరులో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి పల్లపు వెంకట్!

Chintoor: చింతూరులో సీపీఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మండల కార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపు. జడ్పిటిసి అభ్యర్థిగా మీడియం శ్రీదేవి పోటీ.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 26 Oct 2026 4:53 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి పల్లపు వెంకట్!

చింతూరు: స్థానిక సమరంలో బరిలో ఉన్న సిపిఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మండల సిపిఎం కార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. చింతూరు సిపిఎం కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంకట్ మాట్లాడారు.ప్రజలతో నిరంతరం ఉంటూ ప్రజా సమస్యల పై పోరాడే సిపిఎం అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 ఎంపీటీసీ స్థానాలకు మరియు జడ్పిటిసి స్థానానికి అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని అన్నారు.

అభ్యర్థులుగా నిలబడిన వ్యక్తులు విప్లవ పోరాటం నుంచి వచ్చిన వారేనని, ప్రజా సమస్యలు ఏమిటో క్షుణ్ణంగా తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు.వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల ఏనాడు పోరాటాలు ఉద్యమాలు చేయలేదని ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం కూడా ప్రజా అభివృద్ధిని పక్కనపెట్టి స్వలాభం కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు.

స్థానిక సమరంలో సిపిఎం తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి చేసి చూపెడతామని అన్నారు.ప్రధాన పార్టీల నుంచి చింతూరు జడ్పిటిసి స్థానానికి బరిలో దిగనున్న అభ్యర్థుల పై విమర్శలు గుప్పించారు. సిపిఎం పార్టీ నుంచి జడ్పిటిసి గా మీడియం శ్రీదేవి పోటీలో నిలబడుతుందని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పిటిసి అభ్యర్థి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR