Chintalapudi: చింతలపూడిలో 7వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన 7వ రోజు కొనసాగింది. పేస్కేల్ అమలు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 22 Sept 2026 4:31 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో 7వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన

ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం 7వ నిరసన కార్యక్రమం కొనసాగించారు.

వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, నామిని వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కోరారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI