Chintalapudi: స్వయంగా కంప్యూటర్‌పై ఎల్ఓసీ లెటర్లు టైప్ చేసిన ఎమ్మెల్యే

Chintalapudi: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అత్యవసర వైద్యం కోసం వచ్చిన బాధితులకు ఆపరేటర్ లేకపోవడంతో స్వయంగా కంప్యూటర్‌పై ఎల్ఓసీ లేఖలు సిద్ధం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2026 7:15 PM IST
Chintalapudi
X

Chintalapudi: స్వయంగా కంప్యూటర్‌పై ఎల్ఓసీ లెటర్లు టైప్ చేసిన ఎమ్మెల్యే

Chintalapudi: చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తమను కలిసేందుకు వచ్చే ప్రజలు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు.

ఈ క్రమంలో అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన బాధితులకు అవసరమైన ఎల్ఓసీ (LOC) లేఖలను సిద్ధం చేసే సిస్టమ్ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో, సమయం వృథా కాకూడదని భావించిన శాసనసభ్యులు స్వయంగా కంప్యూటర్ ముందు కూర్చొని లేఖలను సిద్ధం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి,వారికి భరోసా కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్