Eluru: కామవరపుకోటలో అక్రమ మద్యం పట్టివేత, 336 సీసాలు స్వాధీనం
Eluru: చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోటలో ఎక్సైజ్, పోలీస్ అధికారుల సంయుక్త దాడుల్లో నల్లూరి ప్రభాకర్ ఇంట్లో నిల్వ ఉంచిన 336 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
Eluru: కామవరపుకోటలో అక్రమ మద్యం పట్టివేత, 336 సీసాలు స్వాధీనం
ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కామవరపుకోటలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పై ఎక్సైజ్, పోలీస్ అధికారులు సోమవారం తెల్లవారుజామున సంయుక్త దాడులు నిర్వహించారు. నల్లూరి. ప్రభాకర్ ఇంట్లో జరిపిన ఈ సోదాల్లో 60.58 లీటర్ల పరిమాణం గల 336 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సమయంలో ప్రభాకర్ పరారీలో ఉండటంతో, అతని తండ్రి పుల్లారావును పోలీసులు అరెస్టు చేసి, ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తడికలపూడి పోలీసులు, కామవరపుకోట రెవెన్యూ, చింతలపూడి ఎక్సైజ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు.




