Chintalapudi: చింతలపూడి ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష

Chintalapudi: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష; రెండు బ్యాలెట్ పేపర్లపై ఓటర్లకు అవగాహన, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 25 Nov 2026 10:48 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడి ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష

చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు చైర్‌పర్సన్,కౌన్సిలర్ పదవులకు విడివిడిగా రెండు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేసేలా పోలింగ్ సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.బుధవారం చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ,స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ఒకే ఓటు వేసి,రెండో బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలి అని ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ,చెక్ లిస్ట్ ప్రకారం సామాగ్రిని సరిచూసుకోవాలి అని పోలింగ్ గదిలోకి అనధికార వ్యక్తులను అనుమతించకూడదు అని సూచించారు.

పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పేపర్ల లెక్కలను సరిచూసి,బాక్సులను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే వరకు సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ చల్లన్న దొర,ఎంపీడీఓ కామేశ్వరి,డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid