Chatrai: చాట్రాయిలో వైఎస్సార్‌సీపీకి షాక్ మంత్రి సమక్షంలో టీడీపీలోకి!

Chatrai: చాట్రాయి మండలం పోతనపల్లి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Oct 2026 9:59 PM IST
Chatrai
X

Chatrai: చాట్రాయిలో వైఎస్సార్‌సీపీకి షాక్ మంత్రి సమక్షంలో టీడీపీలోకి!

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు శుక్రవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

నూజివీడులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్,అనుభవం,మరియు కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము టిడిపిలో చేరినట్లు ఈ సందర్భంగా కార్యకర్తలు వెల్లడించారు.

రాష్ట్ర ప్రగతి,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కేవలం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్