Velairpadu: భూదేవిపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

Velairpadu: వేలేరుపాడు మండలం భూదేవిపేటలో వైఎస్సార్సీపీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి కుంజా కుమారి, ఎంపీటీసీ అభ్యర్థి కొట్టి ఉదయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 30 Oct 2026 3:41 PM IST
Velairpadu
X

Velairpadu: భూదేవిపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

వేలేరుపాడు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్సీపీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీలు బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి కుంజా కుమారి, ఎంపీటీసీ అభ్యర్థి కొట్టి ఉదయ్ గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైఎస్సార్సీపీ మండల నాయకులు కామినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అభ్యర్థులు గ్రామగ్రామాన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. తమకు మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR