Chinthoor: పొల్లూరు జలపాతం సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన కారు
Chinthoor: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం దగ్గర కారు లోయలో పడింది. నలుగురు యువకులను పోలీసులు తాడు సాయంతో కాపాడారు.
Chinthoor: పొల్లూరు జలపాతం సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన కారు
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం సమీపంలో మంగళవారం రాత్రి ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మోతుగూడెం ఎస్సై హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుండి నలుగురు యువకులు AP31CS9009 నెంబర్ గల కారులో 27 తేదీన విహారయాత్రకు బయలుదేరారు. శంకర్, సుభాష్,యోగేష్,విజయ్ లు మారేడుమిల్లి, చింతూరు ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు బయలుదేరారు.
మంగళవారం ఫోర్ బై గ్రామం వద్ద గల పుష్ప బ్రిడ్జి ను సందర్శించారు. అక్కడనుండి పొల్లూరు జలపాతం వైపు బయలుదేరారు.ఈ క్రమంలో కారు అదుపుతప్పి 150 అడుగుల లోతు గల లోయలోకి దూసుకుపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న మోతుగూడెం ఎస్ఐ నాసిర్ హుస్సేన్ సిబ్బందితో కలిసి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో లోయలోకి తాడు సాయంతో దిగి ప్రమాదానికి గురైన నలుగురు యువకులను బయటకు తీసుకురావడం జరిగింది.మోతుగూడెంలోని జెన్కో వైద్యశాలలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోలీసులు తీసుకుని వచ్చారు. చింతూరు వైద్యశాలలో క్షతగాత్రులకు వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు.నలుగురు యువకుల లలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది.




