Agiripalli: బైక్‌లకు నిప్పు పెట్టిన కేసులో ముగ్గురు అరెస్ట్: DSP

Agiripalli: నూజివీడు మండలం ఈదులగూడెంలో మోటార్ సైకిళ్లకు నిప్పు పెట్టిన కేసులో ముగ్గురు నిందితులను ఆగిరిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలే కారణమని డీఎస్పీ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 2:44 PM IST
Agiripalli
X

Agiripalli: బైక్‌లకు నిప్పు పెట్టిన కేసులో ముగ్గురు అరెస్ట్: DSP

Agiripalli: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్లకు నిప్పంటించిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి నాయకుడు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ ఈలప్రోలు సుబ్బయ్య ఇంటి వద్ద షెడ్డులో నిలిపి ఉంచిన మోటార్ సైకిళ్లపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వాహనాలతో పాటు,అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మరియు షెడ్ కూడా దగ్ధమైందన్నారు.

ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 148/2026 కింద కేసు నమోదు చేసి,నూజివీడు రూరల్ సీఐ నాగేంద్ర కుమార్,ఆగిరిపల్లి ఎస్సై నాగరాజు, సిబ్బంది సీసీటీవీ ఫుటేజీ,సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

నిందితులు ఈలప్రోలు సుబ్బయ్యకు అత్యంత సన్నిహితులని అతని ఫాలోవర్స్ అని కేవలం ఆర్థిక లావాదేవీలు,వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుల,మత,రాజకీయ విభేదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్