Eluru: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేసి రైతులకు సత్వరమే పరిహారం అందించాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
Eluru: చింతలపూడి ఎత్తిపోతల భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కలెక్టరేటు గౌతమీసమావేశ మందిరంలో శనివారం చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూసేకరణ పనులు పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టర్ సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న లు పాల్గొన్నారు.ప్రాజెక్టు పనులు పురోగతి,ఇప్పటివరకు భూసేకరణ చేసిన భూములు,ఎన్ని ఎకరాలకు పరిహారం చెల్లించారు.
ఇంకా ఎన్ని ఎకరాలకు పరిహారం చెల్లించాలి, ఇంకా ఎన్ని ఎకరాలు భూసేకరణ చెయ్యాలి,తదితర అంశాలుపై జిల్లా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చెయ్యాలని,పనులు పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
భూసేకరణలో నిర్లక్షం, అలసత్యం వహించే అధికారులుపై చర్యలు తప్పవని అన్నారు.ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ప్రకారం నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని,ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావులేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చెయ్యాలని అన్నారు.
భూసేకరణకు సంబంధించి ఏవైనా న్యాయపరమైన లేదా క్షేత్రస్థాయి సమస్యలు ఉంటే రైతులతో మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులు,జలవనరులు,సంబంధిత శాఖలు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా భూసేకరణ పూర్తిచేసి పనులకు అప్పగించాలని ఆదేశించారు.
ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చెయ్యాలని,మిగిలిన పనులుపై లక్ష్యాలను అధిగమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పులిచింతల యస్ఇ జి.రామకోటేశ్వరరావు,కొవ్వూరు యస్డిసి ఏ.శ్రీశిల్పి, ఆయా మండలాలు తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు,మండల సర్వేయర్లు,జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు,తదితరులు పాల్గొన్నారు.




