Eluru: ఏలూరులో 54 సహాయక శిబిరాలు: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో అర్నబ్ తుఫాన్ సహాయ చర్యల్లో భాగంగా 54 శిబిరాల్లో 1,899 మందికి ఆశ్రయం కల్పించామని, జీరో ప్రాణనష్టం నమోదైందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
Eluru: ఏలూరులో 54 సహాయక శిబిరాలు: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: అర్నబ్ తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో 54 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి,1899 మందికి ఆశ్రయం కల్పించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.తుఫాన్ సమయంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,895.60 మి.మీ. వర్షపాతం నమోదైందని,సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయడం,జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న కారణంగా జిల్లాలో ప్రాణ,ఆస్థి నష్టాలు కలగకుండా చేయగలిగామన్నారు.
ప్రభావిత కుటుంబాలకు అన్ని పునరావాస కేంద్రాలలో సహాయం, పునరావాసంతో పాటు అల్పాహారం,మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం అందించామన్నారు.పునరావాస కేంద్రాల నుండి వెళ్లే ప్రజలకు బియ్యం,నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 440 చెట్లు కూలిపోగా,వెంటనే వాటిని తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్దరించామని, కైకలూరు శాసనసభ నియోజకవర్గం మరియు నిడమర్రు మండలంలోని కొన్ని ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో విద్యుత్ పునరుద్ధరణ జరుగుతోందని,ఈరోజు రాత్రికి పూర్తిచేసేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారన్నారు.
జిల్లాలోని తుఫాన్ ప్రభావిత మండలాలలో సుమారు 16,176.80 హెక్టార్ల వ్యవసాయ భూమి మరియు 770. 44 హెక్టార్ల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని,పొలాల్లో నీరు తగ్గిన తరవాత పంట నష్టం అంచనాలు రూపొందించడం జరుగుతుందన్నారు.153 విద్యుత్ స్తంబాలు దెబ్బతిన్నాయని,వాటిల్లో 69 స్తంభాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు.
13 ఇళ్ళు దెబ్బతిన్నాయని,వాటిలో 10 ఇళ్ళు పాక్షికంగాను,3 పూరిగుడెసెలు దెబ్బతిన్నాయన్నారు.జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ,సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేయడం,నిత్యావసర సేవలను పునరుద్ధరించడం జరిగిందన్నారు.తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కాలానుగుణ ఆరోగ్య సమస్యల కారణంగా రెండు లేత గొర్రెపిల్లలు మరణించాయన్నారు.
విద్యుత్ పునరుద్ధరణ మరియు వ్యవసాయ నష్టాల అంచనా కొనసాగుతున్నాయని,జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్వచ్ఛంద కార్యకర్తలు మరియు ప్రజల సమన్వయ ప్రయత్నాలు సమర్థవంతమైన తుఫాను నిర్వహణ ప్రజా భద్రతకు దోహదపడ్డాయని,ఈ విజయవంతమైన ప్రతిస్పందన ఏలూరు జిల్లా యంత్రాంగం యొక్క సంసిద్ధత, సమష్టి కృషి మరియు ప్రజా భద్రత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.
తుఫాను సహాయక చర్యల సమయంలో సహకరించినందుకు,ప్రతినిధులకు,స్థానిక సంస్థలకు,స్వచ్ఛంద కార్యకర్తలకు మరియు ప్రజలకు,ప్రభుత్వ సిబ్బందికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేసారు.




