Kukkunoor: కుక్కునూరులో టీడీపీలోకి 40 కుటుంబాల చేరిక!

Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని సీఎం కాలనీకి చెందిన 40 కుటుంబాలు కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 24 Oct 2026 2:53 PM IST
Kukkunoor
X

Kukkunoor: కుక్కునూరులో టీడీపీలోకి 40 కుటుంబాల చేరిక!

Kukkunoor: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కుక్కునూరు మండలంలోని సీఎం కాలనీకి చెందిన సుమారు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ములిసెట్టి నాగేశ్వరరావు (నాగు) ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఆయా కుటుంబాల సభ్యులు తెలిపారు. ఈ చేరికలతో సీఎం కాలనీలో పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ములిసెట్టి నాగేశ్వరరావు కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు స్వాగతం పలికారు. అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమం, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR