Chintoor: చింతూరు మండలం చుక్కలపాడులో సీపీఎంకు భారీ షాక్!

Chintoor: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చుక్కలపాడులో 36 కుటుంబాలు సీపీఎం వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక. మాజీ జడ్పీటీసీ చిచ్చడి మురళి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 Oct 2026 2:57 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు మండలం చుక్కలపాడులో సీపీఎంకు భారీ షాక్!

చింతూరు: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీ లో చుక్కలపాడు గ్రామంలో 36 కుటుంబాలు సిపిఎం ను వీడి వైసీపీ పార్టీ లో చేరినట్లు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వై రామలింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు మరియు పార్టీ సిద్దాంతాలు,వైసీపీ స్థానిక నాయకత్వం పై నమ్మకంతో పార్టీలో చేరినట్లు చుక్కలపాడు గ్రామ పూజారి మరియు పటేల్ రవ్వ జోగయ్య,మడవి ఎర్రయ్య ,గ్రామస్థులు బొజ్జయ్య, ఉంగయ్య, పోడియం ఆడమయ్య, దేవయ్య తెలిపారు.మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ మాజీ జడ్పీటీసీ చిచ్చడి మురళి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏడుగుర్రాలపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఉయిక నాంచారి ని పరిచయ కార్యక్రమం నిర్వహించి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో మన అభ్యర్థిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్, మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు, మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు,చింతూరు మాజీ సర్పంచ్ కారం కన్నారావు, నాయకులు యూత్ అధ్యక్షులు మడవి రాజు, మీడియం లక్ష్మణ్, సోయం నాగేశ్వరావు, వెట్టి జోగయ్య, కుమార్, నర్సింహులు, బాబురావు,రమణ, మడకం రమేష్, వైసీపీ కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR