Kukunoor: గోదావరిలో 16 ఏళ్ల బాలుడు గల్లంతు: పెదరావిగూడెంలో విషాదం

Kukunoor: కుక్కునూరు మండలం పెదరావిగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన 16 ఏళ్ల విద్యార్థి బూరం పాల్రాజ్ గల్లంతయ్యాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2026 9:21 PM IST
Kukunoor
X

Kukunoor: గోదావరిలో 16 ఏళ్ల బాలుడు గల్లంతు: పెదరావిగూడెంలో విషాదం

Kukunoor: కుక్కునూరు మండలం పెదరావిగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తుండగా 16 ఏళ్ల బాలుడు బూరం పాల్రాజ్ గల్లంతయ్యాడు. అల్లిగూడ గ్రామానికి చెందిన పాల్రాజ్ గుంటూరులోని బాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కర్ ఘాట్‌కు వెళ్లిన పాల్రాజ్, మణికంఠతో కలిసి నదిలో స్నానానికి దిగాడు. మణికంఠ బయటకు వచ్చిన అనంతరం పాల్రాజ్ కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న కుక్కునూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు గల్లంతైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్