Polavaram: వందేమాతర గీతానికి 150 ఏళ్లు.. పోలవరంలో ఘనంగా వేడుకలు!

Polavaram: వందేమాతర గీతానికి 150 ఏళ్లు ఏలూరు జిల్లా పోలవరం విజ్ఞాన భారతి హైస్కూల్‌లో సామూహిక గీతాలాపన విద్యార్థుల్లో వెల్లివిరిసిన దేశభక్తి, ఘనంగా వేడుకలు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 29 Sept 2026 5:01 PM IST
Polavaram
X

Polavaram: వందేమాతర గీతానికి 150 ఏళ్లు.. పోలవరంలో ఘనంగా వేడుకలు!

పోలవరం: పోలవరం ఏలూరు జిల్లా పోలవరం స్థానిక విజ్ఞాన భారతి హై స్కూల్ నందు కరస్పాండెంట్ కొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ప్రధానోపాధ్యాయురాలు సంతోషి దుర్గా భవాని అధ్యక్షతన వందేమాతర గీతానికి 150 ఏళ్లు నిండినందున అట్టహాసంగా దేశభక్తి విద్యార్థుల్లో పెంపొందించడానికి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దల సమక్షంలో 150 ఏళ్లు మన జాతీయ గీతాన్ని అందరూ కలిసి ముక్తకంఠంతో ఆలపించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ కొమిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ప్రధానోపాధ్యాయులు సంతోషిని దుర్గ భవాని మాట్లాడుతూ వందేమాతరం అంటే "మాతృభూమి! నీకు వందనం" అని అర్థం ఈ గానమే మన భారత దేశ మొట్టమొదటి దేశభక్తి గీతం. ఈ గీతంలో భారతమాతని మూడు విధాలుగా మూడు రూపాలుగా కీర్తించడం జరుగుతుంది. అందులో మొదటిది జగద్దాత్రి, రెండవది కాళీమాత, మరి మూడవది దుర్గ. గా ఈ గానం రచించారు.

దీనిని రచించిన వారు బకీం చంద్ర చటర్జీ సంస్కృత పదాల తో బెంగాలీ భాషలో 1875 నవంబర్ 7వ తేదీన మొదటిగా రాసినప్పటికీ 1876 సంవత్సరం "ఆనందమఠం " అనే ధారావాహిక నవలగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై సన్యాసులు తిరుగుబాటు కథనంగా పత్రికల్లో వచ్చినప్పుడు ఈ వందేమాతర గీతం బహుళ ప్రాచుర్యం పొందింది.

రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 సంవత్సరం కలకత్తాలోని శ్రీ రహమతుల్ల సాయని అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి గానం చేశారు ఇది ఆనాడు మన భారత స్వతంత్ర ఉద్యమంలో దేశ గౌర ప్రతిష్టను ఇనుమడింపజేసింది అనడంలో సందేహమే లేదు.

1915 నుంచి శ్రీ విష్ణు దిగంబర పులస్కార్ ఈ గీతాన్ని కాపీ రాగంలో స్వరపరిచి ప్రస్తుతం మనం వింటున్న బాణీలో బహుళ ప్రాచుర్యంలోనికి తెచ్చారు. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ బాబు రాజేంద్రప్రసాద్, పండిట్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వంటి ప్రముఖుల సమక్షంలో వందేమాతరం లోని మొదటి రెండు చరణాలు మన భారత రాష్ట్ర గానంగా అధికారికంగా గుర్తించి దీనికి జాతీయగీతమైన, "జన గణ మన " తో సమానమైన హోదా మరియు గౌరవం ఇవ్వాలని ప్రకటించారు.

ఇప్పుడు ఆగస్టు 2, 2026వ తేదీన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ పూర్తి గీతానికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ గీతాన్ని అవమానపరిచిన వారికి జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడునని ప్రకటించారని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సంతోషి దుర్గ భవాని, కరస్పాండెంట్ కొమిశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, రేణుక, ఆశ్లేష, భావన, రజియా, తులసి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM