Eluru: కేరళ దంపతులకు 10 నెలల చిన్నారి దత్తత.. అందజేసిన కలెక్టర్

Eluru: ఏలూరు శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న 10 నెలల చిన్నారి స్ఫూర్తిని కేరళ దంపతులకు కలెక్టర్ కె. వెట్రిసెల్వి మిషన్ వాత్సల్య ద్వారా దత్తతగా అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 9:17 PM IST
Eluru
X

Eluru: కేరళ దంపతులకు 10 నెలల చిన్నారి దత్తత.. అందజేసిన కలెక్టర్

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న 10 నెలల చిన్నారి బేబీ స్ఫూర్తిని కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాకు చెందిన రాజశేఖర్ కె.వి.సుజిత దంపతులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం దత్తతగా అందజేశారు. మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా దత్తతకు దరఖాస్తు చేసుకున్న దంపతుల ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

చిన్నారిని కన్నబిడ్డలా ప్రేమతో చూసుకుంటూ, మంచి విద్య అందించి అభివృద్ధిలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి.హెచ్.సూర్య చక్రవేణి,శిశు గృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్