TG SSC Exams 2027: SSC పరీక్షలు 2027.. ఫీజు చెల్లింపునకు నవంబర్ 26 వరకు గడువు!
TG SSC Exams 2027: 2027 మార్చి SSC పరీక్షల ఫీజును నవంబర్ 26 వరకు ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. ఆలస్య రుసుముల తేదీలను కూడా ప్రకటించారు.
TG SSC Exams 2027: SSC పరీక్షలు 2027.. ఫీజు చెల్లింపునకు నవంబర్ 26 వరకు గడువు!
TG SSC Exams 2027: 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి (SSC), OSSC, వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ సవరించింది. ఈ మేరకు సోమవారం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది.
ఆలస్య రుసుములతో ఫీజు చెల్లింపు తేదీలు
నవంబర్ 26 తర్వాత ఫీజు చెల్లించే విద్యార్థులకు ఆలస్య రుసుములు వర్తిస్తాయని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
పరీక్ష ఫీజు వివరాలు ఇవే
పరీక్షల విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం.. అన్ని సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషనల్ కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి.
మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి
విద్యార్థుల పరీక్ష ఫీజును పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారిక BSE వెబ్సైట్లోని సైబర్ ట్రెజరీ సదుపాయం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో సమర్పించాలని అధికారులు సూచించారు.
మాన్యువల్ బ్యాంక్ చలాన్లను స్వీకరించబోమని పరీక్షల డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే ఫీజు చెల్లింపు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని వెల్లడించింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలు నిర్ణీత తేదీల్లోగా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.




