Hyderabad: మలక్‌పేట్ డీ-మార్ట్ వద్ద ప్రమాదం.. బస్సు చక్రాల కిందపడి మహిళ మృతి!
Hyderabad: మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ అదుపుతప్పి పడటంతో బస్సు కిందపడి ఎల్బీనగర్‌కు చెందిన వివాహిత లావణ్య (25) అక్కడికక్కడే మృతి.
Hyderabad: మలక్‌పేట్ డీ-మార్ట్ వద్ద ప్రమాదం.. బస్సు చక్రాల కిందపడి మహిళ మృతి!
Hyderabad: మలక్‌పేటలోని డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్‌బీనగర్‌కు చెందిన బి. లావణ్య (25) తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనం నంబర్ TS 09 FF 2709పై ఎల్‌బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తుండగా, డీ-మార్ట్ సిగ్నల్ వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోవడం జరిగింది.
ఈ క్రమంలో లావణ్య అదే మార్గంలో వెళ్తున్న AP 39 Z 0361 నంబర్ గల బస్సు వెనుక చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి.
సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి సంబంధించి బస్సు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది.




