Nellore: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజు పేట వద్ద జాతీయ రహదారి 565పై కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి.
Nellore: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజు పేట వద్ద జాతీయ రహదారి 565పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా (47),మణికల సుధాకర్ (45) మృతి చెందారు, ఏలూరు నుండి పెంచలకోన కు వెళుతున్న కారు, చింతలపాలెం గ్రామంలో పెయింట్ పనులు ముగించుకొని స్వగ్రామం పాతదేవరాయపల్లి కి వెళ్తుండగా,వెంకటరామరాజు పేట మలుపు వద్ద మోటార్ బైక్ ను డికొట్టింది.
ఈ ఘటనలో బైక్ లో ఉన్న వ్యక్తులు గాలిలో లేచి రోడ్డు పై పడి ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి కోన ఉపరితో ఉండగా 108 వాహనంలో నికి ఎక్కిస్తుండగా వెంటనే మృతి చెందాడు. రాపూరు సీఐ శ్రీనివాసులు, కలువాయి ఎస్ ఐ కోటయ్య, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.




