Renigunta: ఎల్లమండ్యంలో విద్యుత్ షాక్‌తో 47 ఏళ్ల వ్యక్తి మృతి!
Renigunta: రేణిగుంట మండలం ఎల్లమండ్యంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ వద్ద పంచాయతీ మోటార్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందారు.
Renigunta: ఎల్లమండ్యంలో విద్యుత్ షాక్‌తో 47 ఏళ్ల వ్యక్తి మృతి!
Renigunta: రేణిగుంట మండలం ఎల్లమండ్యం గ్రామ పంచాయతీ పరిధిలోని పిల్లపళ్లెం హరిజనవాడలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి నీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న పంచాయతీ మోటార్‌ను ఆఫ్ చేసేందుకు వెళ్లిన మంచికాయలు రేణుకార్జున (47) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
మోటార్ స్టార్టర్‌ను ఆఫ్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో గట్టిగా అరుస్తూ కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే రేణిగుంటలోని సన్‌రైస్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. రుయా ఆసుపత్రికి తరలించగా, రాత్రి సుమారు 9:52 గంటలకు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ప్రాథమికంగా స్టార్టర్‌కు విద్యుత్ సరఫరా చేసే వైరు దెబ్బతినడం వల్ల ఐరన్ బాక్స్‌కు విద్యుత్ ప్రసారం జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి భార్యకు ఎలాంటి అనుమానం లేదని తెలిపినట్లు పేర్కొన్నారు. ఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




