Renigunta: రేణిగుంట-మామండూరు మధ్య రైలు ఢీకొని వ్యక్తి మృతి!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట-మామండూరు మధ్య రైలు ఢీకొని సుమారు 25-30 ఏళ్ల యువకుడు మృతి. మృతుడి ఆనవాళ్ల ఆధారంగా వివరాల కోసం రైల్వే పోలీసుల దర్యాప్తు.
Renigunta: రేణిగుంట-మామండూరు మధ్య రైలు ఢీకొని వ్యక్తి మృతి!
Renigunta: మామండూరు–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
రైల్వే నుంచి అందిన సమాచారంతో ఉదయం 10 గంటల సమయంలో సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మామండూరు ఆర్ఎస్–రేణిగుంట ఆర్ఎస్ మధ్య కిలోమీటర్ నంబర్ 135/7-5 వద్ద సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎగువ మార్గంలో వెళ్తున్న గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతుడి వద్ద ఎలాంటి ఆస్తులు, గుర్తింపు కార్డులు లభించలేదు. రైలు టికెట్ కూడా లభించలేదని అధికారులు తెలిపారు.
మృతుడి ఆనవాళ్లు: సుమారు 5.9 అడుగుల ఎత్తు, చామనిచాయ రంగు, నల్లటి జుట్టు కలిగి ఉన్నాడు. తెలుపు రంగు ఫుల్హ్యాండ్ షర్ట్, నల్లటి లైన్లు, నల్లటి షార్ట్, లైట్ బ్రౌన్ రంగు లోదుస్తులు ధరించి ఉన్నాడు. కుడివైపు వీపు పైభాగంలో నల్లటి పుట్టుమచ్చ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు సంబంధిత పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి దర్యాప్తు అనంతరం మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన తదుపరి విషయాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.




