Chintapalli: ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందక నిండు గర్భిణీ బిడ్డ మృతి!

Chintapalli: అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ కడుపులో బిడ్డ మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన, అధికారుల విచారణకు డిమాండ్.

SAI, PADERU
Published on: 23 Sept 2026 12:53 PM IST
Chintapalli
X

Chintapalli: ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందక నిండు గర్భిణీ బిడ్డ మృతి!

Chintapalli: చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకొని నిండు గర్భిణి బిడ్డతో సహా చనిపోవడానికి సరైన వైద్య పరీక్షలు చేయకపోవడమే కారణమని వైద్యులను నిలదీశారు. దీంతో మృతురాలి బంధువులు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

వైద్యులు తమకు ఏమి సంబంధం లేదని ఇది అంతా సిహెచ్ డబ్ల్యూ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేసి సి ఎస్ డబ్ల్యూ ను బాధ్యురాలుగా చేసి తప్పించుకున్నారు. ఏది ఏమైనా వైద్యులు నిర్లక్ష్యము లేక మరే కారణాలైన అల్లూరి మన్యంలో మాతృమూర్తులు చావులు సర్వసాధారణంగా జరగడంలో అతిశయోక్తి కాదు.

ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గిరిజనులకు వైద్యం అందుబాటులోకి తేవాలని మెడికల్ కాలేజ్ స్థాపించి ప్రతి ఏరియాలో ఏరియా ఆసుపత్రులను వైద్యులు నియమిస్తున్నప్పటికీ ఏజెన్సీలో గర్భిణీ స్త్రీల చావులు సంభవిస్తూనే ఉన్నాయి.

దీనికి ప్రధాన కారణం మన్యంలో గర్భిణీ స్త్రీలకు అవగాహన లోపం తో సరైన పరీక్షలు చేయించకపోవడం ప్రధాన కారణమని అనేకలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఏది ఏమైనా అధికారులు వైద్యంపై గిరిజనులకు సరైన అవగాహన కల్పించి మూఢనమ్మకాలకు దూరం చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.

మన్యంలో గర్భిణీ స్త్రీల మృత్యువాత పడడం సర్వసాధారణంగా కొనసాగుతూనే ఉంది. వీటిపై ప్రభుత్వాలు అధికారులు సరైన చర్యలు చేపట్టి మన్యంలో మాతృమూర్తుల చావులకు ముగింపు పలికేది ఎప్పుడో వేచి చూడాలి.

SAI, PADERU

SAI, PADERU