Kothagudem: కొత్తగూడెంలో భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ పిసి భర్త!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భవానిని హత్య చేసి గోదావరి నదిలో పడేసిన ఏఆర్ పిసి నరేందర్. ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ నేతృత్వంలో కేసు ఛేదన.
Kothagudem: కొత్తగూడెంలో భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ పిసి భర్త!
Kothagudem: తేదీ 06.11.2026న గుండారపు స్వరూప తన సోదరి భవాని కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 205/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా భవాని భర్త బోడా నరేందర్ (30), ఏఆర్పీసీ-623, గోలియాతండా, టేకులపల్లి మండలం, పోలీసుల విచారణలో తన భార్యను హత్య చేసినట్లు వెల్లడించాడు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, తేదీ 03.11.2026 రాత్రి సుమారు 8 గంటల సమయంలో తన అద్దె ఇంటిలో భార్య భవానిని చేతులతో నులిమి, చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని తెల్లని సంచిలో ఉంచి తన స్వగ్రామమైన గోలియాతండాకు తీసుకెళ్లి, తన తండ్రి హరిలాల్ సహాయంతో వ్యవసాయ పొలంలో దాచిపెట్టినట్లు వెల్లడించాడు.
ఆ తర్వాత తేదీ 04.11.2026 రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన తండ్రి సహాయంతో మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి నదిలో పడవేసినట్లు విచారణలో తెలిపాడు. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది.నిందితుడు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు పంచుల సమక్షంలో గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి భవాని మృతదేహాన్ని గుర్తించారు.
ఈ కేసులో నిందితుడు బోడా నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. నేరంలో ప్రమేయం ఉన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ సీఐ జితేందర్, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయ్ సింహారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ రమేష్‌తో, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.




