Ibrahimpatnam: కూలింగ్ కెనాల్‌లో దొరికిన శవం కళ్యాణిదిగా గుర్తింపు!

Ibrahimpatnam: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్‌లో దొరికిన మహిళా మొండెం కేసును పోలీసులు చేధించారు. మృతురాలు మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 4:04 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: కూలింగ్ కెనాల్‌లో దొరికిన శవం కళ్యాణిదిగా గుర్తింపు!

Ibrahimpatnam: 18వ తేదీన మహిళా మొండెం కూలింగ్ కెనాల్ దొరికింది. NTTPS DE ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారించాం. కాలువలో రెండు రోజులు గాలింపు చర్యలు చేపట్టడంతో మహిళా తల ,కాళ్ళు చేతులు మిగతా భాగాలు దొరికాయి.

శరీర భాగాలు మంగళగిరికి చెందిన యువతి కళ్యాణిగా గుర్తించాం. కళ్యాణి ఆమె సోదరుడు ఇద్దరు కేర్ అండ్ షేర్ లో పెరిగారు.

మంగళగిరీలో హుసేన్ కట్ట అనే ప్రాంతంలో యువతిని ఒంటరిగా నివసిస్తూ ఉండేది. కళ్యాణి సోదరుడు కూడా మృతదేహాన్ని కళ్యాణి అని గుర్తించారు. కల్యాణిదీ కలిదిండి మండలం చిన్న తాడినాడ గ్రామం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్